కోదాడలో ఆధ్యాత్మిక వైభవానికి శ్రీకారం..
శ్రీకృష్ణ కాలచక్రం, విష్ణు పంచాయతనం, ఆయుధ చండీ, అతిరుద్ర మహాయాగం..
లక్ష గాజులతో ఆయుధ చండీ అమ్మవారికి ప్రత్యేక పూజలు..
కులమతాలకు అతీతంగా మహా యాగ కార్యక్రమాలు. భక్తులకు స్వామీజీ పిలుపు..
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు శ్రీకృష్ణ కాలచక్రం, విష్ణు పంచాయతనం, ఆయుధ చండీ, అతిరుద్ర మహాయాగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా ఆయుధ చండీ అమ్మవారికి లక్ష గాజులతో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించి భక్తులు ఆధ్యాత్మికంగా తరించారు.. ప్రధాన రామాయణ పారాయణం, చతుర్వేద యాగశాల, అతిరుద్ర యాగశాలలో ప్రత్యేక యాగ క్రతువులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.. ఈ మహా యాగ కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై భక్తిభావంతో పాల్గొనాలని శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూప నంద స్వామీజీ కోరారు.. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని యాగ కార్యక్రమాల సంపూర్ణ ఫలితాలను పొందాలని ఆకాంక్షించారు.. ఆధ్యాత్మికతకు ప్రతీకగా, భక్తిభావానికి వేదికగా కోదాడలో జరుగుతున్న ఈ మహా యాగ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి..