క్రూరమైన టీఎంసీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఐదేళ్ల క్రితం నందిగ్రామ్ ఫలితాలే.. భవానీపూర్‌లో పునరావృతం అవ్వడం ఖాయం. -మోడీ.
క్రూరమైన టీఎంసీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఐదేళ్ల క్రితం నందిగ్రామ్ ఫలితాలే.. భవానీపూర్‌లో పునరావృతం అవ్వడం ఖాయం. -మోడీ..
క్రూరత్వానికి మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్
ప్రభుత్వాన్ని గద్దె దించాలని పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి వైఫల్యానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని, రాష్ట్రాన్ని వెనక్కి లాగుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రగతి కావాలంటే బీజేపీని గెలిపించాలని సూచించారు. బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. భయానక పాలన నుంచి బెంగాల్‌ను రక్షిస్తామని, సర్వత్రా విశ్వాసం నెలకొనే వాతావరణాన్ని సృష్టిస్తామని ప్రకటించారు.
రేవు నగరం హల్దియా, అసన్సోల్తోపాటు సూరి పట్టణంలో గురువారం ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. భయానక వాతావరణం నెలకొని ఉంటే పెట్టుబడులను ఆకర్షించలేమని, విశ్వాసం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నిర్మమ్(క్రూరమైన) సర్కార్‌గా అభివర్ణించారు. దేశమంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే బెంగాల్ మాత్రం వెనుకంజలోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.