నేరేడుచ‌ర్ల‌లో పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్ర‌వారం ప్రత్యేక త‌నిఖీలు…తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు….!

నేరేడుచ‌ర్ల‌లో పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్ర‌వారం ప్రత్యేక త‌నిఖీలు నిర్వహించారు. పోలీసులతో కలిసి అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్భంగా ఆంధ్రా నుండి ధాన్యం లారీలు తెలంగాణలోకి రాకుండా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ధాన్యం ఎక్కడి నుండి వస్తోంది.. ఏ మిల్లుల‌లు వెళ్తోంది, రైతు పేరు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్, ఆర్.సైదులు పాల్గొన్నారు…

తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు...

తనిఖీ పేరుతో సుమారుగా గంటలకు కొద్ది వాహనాలను అన్నింటిని రోడ్డుపై ఆపేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఆలగడప, నేరేడుచర్ల మండలం చెల్లేపల్లి టౌన్ ప్లాజా వర్క్ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది.. మండుతున్న ఎండకి కనీసం త్రాగునీరు కూడా లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రయాణికులు.. మరికొందరు ప్రయాణికులు సైతం అధికారులని ప్రశ్నించడం జరిగింది ఆ గ్రామం వ్యక్తం చేశారు..