భారత ఆర్మీ అమ్ములపొదిలోకి మరో అసలైన సాంకేతిక ఆయుధం..ఆత్మాహుతి డ్రోన్స్ ఆర్మీ నార్తర్న్..!

భారత ఆర్మీ అమ్ములపొదిలోకి మరో అసలైన సాంకేతిక ఆయుధం చేరింది. ఆధునిక యుద్ధంలో అత్యంత కీలక పాత్ర పోషించే.. ఆత్మాహుతి డ్రోన్లు ఆర్మీ నార్తర్న్ కమాండ్ చెంతకు చేరాయి. సరిహద్దుల్లో ప్రాణనష్టం జరగకుండా శత్రువులను తుదముట్టించే లక్ష్యంతో.. కేంద్ర రక్షణ శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ వందలాది డ్రోన్లను విజయవంతంగా అందజేసింది..రెండు నెలల్లోనే డెలివరీ..
గతేడాది పహల్గాం వంటి ఘటనల నేపథ్యంలో సరిహద్దు రక్షణపై భారత్ మరింత దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అత్యవసర కొనుగోలు కింద రూ. 10 కోట్ల ఒప్పందంతో ఈ డ్రోన్ల తయారీ బాధ్యతను స్వదేశీ సంస్థలకు అప్పగించింది. ముఖ్యంగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ అనే సంస్థ వందలాది ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ నార్తర్న్ కమాండ్‌కు డెలివరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించనప్పటికీ.. ఇవి ఉత్తర సరిహద్దుల్లో భారత సైనిక బలాన్ని రెట్టింపు చేస్తాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు..

కామికాజ్ అనేది జపనీస్ పదం కాగా.. దాని అర్థం దివ్య పవనం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తమ విమానాలతో శత్రు లక్ష్యాలపై దాడులు చేసిన ఆత్మాహుతి పైలెట్లను గుర్తు చేసేలా ఈ పేరు పెట్టారు. అయితే ఇవి ఒకసారి వెళ్తే మళ్లీ తిరిగ రాలేవు. కానీ శత్రు సైన్యాలను పూర్తిగా నాశనం చేయగలవు. కామికాజ్ డ్రోన్లలో మనుషులు ఎవరూ ఉండరు. దీనికి ప్రత్యేకమైన గాగుల్స్ ఉంటాయి. దీని ద్వారానే లైవ్, రియల్ టైమ్ వీడియోను రికార్డు చేస్తుంది. అంతేకాకుండా గైడెడ్ మిస్సైళ్ల కంటే వీటి ఖర్చు తక్కువ కాగా.. పది నిమిషాల్లోనే ఇది అనుకున్న లక్ష్యాలను చేధిస్తుంది…