ట్రంప్ కారణంగానే హోర్ముజ్ జలసంధికి ఇలాంటి పరిస్థితి.. చైనా

చైనా, జపాన్ దేశాలకు హోర్ముజ్ జలసంధిని తెరిచే ధైర్యం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి..ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ట్రంప్ కారణంగానే హోర్ముజ్ జలసంధికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చైనా వ్యాఖ్యానించింది. సోమవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘యుద్ధం మొదలవ్వడానికి ముందు హోర్ముజ్ జలసంధి తెరిచే ఉంది. ఏ అవసరం లేకపోయినా యుద్ధం మొదలెట్టింది మీరే. హోర్ముజ్‌ను మిగిలిన దేశాలకు కూడా లేకుండా మూయించి వేశారు’ అని అన్నారు..

చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి

ఇరాన్ ఓడ రేవులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో జరిగిన సమావేశంలో స్పందించారు. హోర్ముజ్ జలసంధి కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, ఇది ప్రపంచ వాణిజ్యం.. ఇంధన భద్రతకు వెన్నెముక అని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించి, అన్ని పక్షాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు…