శ్రీశైలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు 314 మద్యం బాటిల్స్, 24 లీటర్ల నాటుసారా స్వాధీనం..!

నంద్యాల, శ్రీశైలం:

శ్రీశైలంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో భారీగా మద్యం పట్టుబడింది. బస్టాండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక దళాలు సోదాలు చేపట్టగా, మొత్తం 314 మద్యం బాటిల్స్ మరియు 24 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా మరియు నిల్వపై కేసు నమోదు చేసి, ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు… పవిత్ర పుణ్యక్షేత్రం లో మద్యం దొరకడంతో భక్తుల అగ్రహం వ్యక్తం చేస్తున్నారు..