_నల్గొండ జిల్లా:-_
*🔹ఏసీబీ వలలో దేవరకొండ ADE సైదులు.*
దేవరకొండ పట్టణంలో విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద నుండి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఏడీఈ సైదులు..గురువారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. రూ.10లక్షల బిల్లును మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేయడంతో అధికారులు ఈ దాడి నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా.. 2025 అక్టోబర్లో సంభవించిన తుఫాను వల్ల కంబాలపల్లి సబ్స్టేషన్ పరిధిలోని 33/11 kV విద్యుత్ లైన్ దెబ్బతింది. ఈ లైన్ను పునరుద్ధరించిన కాంట్రాక్టర్ (ఫిర్యాదుదారు) పనులకు సంబంధించి రూ.10 లక్షల బిల్లు పెండింగ్లో ఉంది.
ఈ బిల్లును ప్రాసెస్ చేసి పంపేందుకు ఏడీఈ సైదులు లంచం డిమాండ్ చేశారు. గురువారం ఫిర్యాదుదారుడి నుంచి రూ. 30,000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రసాయనాలతో కూడిన లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన ఏడీఈ సైదులును అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆయనను రిమాండ్ నిమిత్తం హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.