గవర్నర్ కోటాలో MLCలుగా కోదండరామ్, అజారుద్దీన్.
జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ రాజకీయాల్లో గత మూడేళ్లుగా సస్పెన్స్గా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్ అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది.
ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్కు ఈ నియామకం అత్యంత కీలకం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన ఈ నెల 30 లోగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయకపోతే మంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఉండేది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గవర్నర్ను కలిసి అభ్యర్థిత్వాలను త్వరగా ఆమోదించాలని కోరారు. గవర్నర్ నిర్ణయంతో అజారుద్దీన్ మంత్రి పదవికి ఉన్న గండం గట్టెక్కినట్లయింది.