బుల్లెట్‌ రైళ్లతో దక్షిణాది ముఖచిత్రం మారబోతోంది’..

బుల్లెట్‌ రైళ్లతో దక్షిణాది ముఖచిత్రం మారబోతోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. అమరావతి, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరగబోతోందన్నారు. బుల్లెట్‌ రైళ్లతో హైస్పీడ్‌ డైమండ్‌ ఏర్పాటు కాబోతుందన్నారు. హైస్పీడ్‌ డైమండ్‌.. దక్షిణాది పట్ల తమ నిబద్ధతకు తార్కాణం అని పేర్కొన్నారు. మోదీ సర్కారు అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు.