భారత్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి సంప్రదింపులు…!

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు బుధవారం సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి ఫోన్ చేశారు. ఇరువురు నేతలు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించి, సంప్రదింపులు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికి వచ్చారు…భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం దీనిపై ట్వీట్‌ చేసింది. అమెరికా-ఇరాన్‌ పక్షాలు కాల్పుల విరమణకు సంబంధించిన తాజా పరిణామాలు, భారత్‌-ఇరాన్‌ ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై జైశంకర్‌, అబ్బాస్ అరఘ్చిర్చించారని తెలిపింది.

ఎక్స్‌లో జైశంకర్ పోస్ట్ చేస్తూ.. “ఇవాళ సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితి, పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. నిరంతరం సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించాం” అని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉద్రిక్తతలు పెరిగితే అసాధారణ పద్ధతులు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. ఐఆర్జీసీ నౌకాదళ రాజకీయ వ్యవహారాల ఉపాధికారి మొహమ్మద్ అక్బర్జాదెహ్ అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. అమెరికా ఏదైనా తప్పుడు చర్యలకు పాల్పడితే ఆ దేశం ఆశ్చర్యపోయేలా అమలుచేసే వ్యూహాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

ఏ దాడి జరిగినా ప్రతిస్పందించడానికి ఐఆర్జీసీ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్‌ అంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ నసుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా మరణించారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులపై గల్ఫ్ దేశాల్లో ఇరాన్‌ దాడులు చేసింది. దీని వల్ల సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడింది…