ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు

ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు

సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం ఆపిన టికెట్ స్క్వాడ్

అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్

దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చె*ప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు…

నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై బస్ కండక్టర్, బస్సులోని ప్రయాణికులు చెప్పుతో దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. టికెట్ తీసుకోని ప్రయాణికుడు, కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు తనకు రూ.20 వేలు లంచం ఇవ్వాలంటూ చెకింగ్ అధికారి డిమాండ్ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఆ వివాదం కాస్తా మాటా మాటా పెరిగి.. దాడికి కారణం అయింది. చెకింగ్ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు, కండక్టర్.. అతడిని ఆర్టీసీ వాహనంలో నుంచి బయటికి లాగి మరీ దాడి చేశారు. చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికులు దాడి చేసిన వీడియోను స్థానికులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది…