సూర్యాపేట జిల్లా.. మఠంపల్లి మండలం మట్టపల్లి లొ ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం…. భారీగా పాల్గొన్న భక్తులు…
ఇరుముడి సమర్పించుకున్న లక్ష్మీ నరసింహ స్వామి , మాల ధరించిన స్వాములు…..
29 నుండి 4 తేదీ వరకు ఘనంగా స్వామివారి కార్యక్రమాలు.. ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. నేడు అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు అంతేకాకుండా.. కృష్ణానది తీరాన వెలిచిన అత్యంత మహిమ గలిగిన శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి జయంతిని పురస్కరించుకుంటూ ఐదు రోజులు పాటు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు…..
ఐదు రోజులు పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతోందని అన్నారు..
వేకువ జామినే స్వామివారి కల్యాణ మహోత్సవం… అంతేకాకుండా మట్టపల్లి తిరువీధుల్లో స్వామివారికి గరుడ వాహనంపై ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు…. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారని తెలిపేరు….
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మట్టపల్లి శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం గురువారం మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి, కళ్యాణోత్సవానికి, హాజరయ్యేందుకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కళ్యాణోత్సవం వైభవం అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి తిరుకళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక
పూజలు, అభిషేకాలు, అలంకారాలతో స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారి కళ్యాణ వేడుకలో పాల్గొన్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుని, దైవ అనుగ్రహం పొందారు. స్వామివారి దివ్య మంగళ హారతి కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది. భక్తులకు విస్తృత ఏర్పాట్లు ఈ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉచిత అన్నసత్రాలు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. తాగునీరు, శుచిత్వం, క్యూలైన్ల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు సత్రాలలో విశ్రాంతి వసతులు కల్పించారు. భద్రత కోసం పోలీసు బందోబస్తు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.
బస్సుల కొరతతో రాకపోకలకు ఇబ్బంది..*
భక్తులు రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడడం జరిగింది.. బస్సులు సరైన సమయానికి లేకపోవడం, పెట్రోల్ డీజిల్ కొరతతో ప్రైవేట్ వాహనాలు భారీగా టికెట్ రేట్లు పెంచడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు..