దిల్లీలో అగ్నిప్రమాదం.. 9మంది మృతి.

దేశరాజధాని దిల్లీ (Delhi)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ పేలడంతో ఓ నివాససముదాయంలో మంటలు చెరలేగాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. షాదార్‌లోని వివేక్‌ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది భవనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 14 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో మరింతమంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 10 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.

దట్టమైన పొగ నుండి 12 మందికి పైగా ప్రజలను రక్షించారు. మృతుల సంఖ్య 8 9కి పెరిగింది. మరో నలుగురు తీవ్రంగా కాలిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణల ప్రకారం, భవనంలోని రెండవ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్‌లో ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగి, అవి మూడవ అంతస్తుకు వ్యాపించాయి. మంటలు మూడవ అంతస్తుకు చేరిన తర్వాత ఫ్లాట్‌లోని వారు తమను తాము రక్షించుకోవడానికి ఇంటి పైకప్పుపైకి పరుగెత్తారు.