హర్మూజ్ జలసంధిని దాటిన భారత నౌక. ..

హర్మూజ్ జలసంధిని దాటిన భారత నౌక.

భారత నౌకలో 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ.

ఈనెల 13న విశాఖ చేరుకోనున్న ఎల్పీజీ నౌక…

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ సమస్య మరింతగా జఠిలం కాకుండా కేంద్రం తగిన చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు చెందిన రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. ఇది ఒకింత ఉపశమనం కలిగిస్తోంది. ఈ రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్‌ను దాటి అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశింనట్టు వార్తా కథనాలు వస్తున్నాయి.

ఉద్రిక్తతల కారణంగా భారత్‌కు చెందిన నౌకలు రోజులతరబడి అక్కడే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మన నౌకలు సురక్షితంగా హర్మూజ్‌ దాటేందుకు.. ఇరాన్ అధికారులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరిపింది. దీంతో కొన్ని రోజులుగా భారత నౌకలు ఒక్కొక్కటిగా దేశీయ పోర్టులకు చేరుకుంటున్నాయి