నేడు: రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు….
తెలంగాణ : రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత ఉంది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పిడుగులు కూడా పడే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, పశుకాపరులు ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు…