ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై.
కాంగ్రెస్ తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటన.
లోక్ సభ లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్ కి డీఎంకే లేఖ…
బిజెపి ఆడిన మైండ్ గేమ్ లో కూటమిలో అతలాకుతలం….
పొలిటికల్ గేమ్ ఆడిననట్లు ప్రచారం..
.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో టీవీకేకు మద్దతు తెలపడంపై కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్న డీఎంకే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య దశాబ్దాల కాలం నాటి పొత్తుకు అధికారికంగా ముగింపు పలికింది. ఈ నేపథ్యంలో లోక్సభలో తమ పార్టీ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, కాంగ్రెస్తో తమ పొత్తు ముగిసిందని అందువల్ల ఇప్పటి వరకు పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చుంటున్న డీఎంకే సభ్యులు ఇకపై వారి పక్కన కూర్చోవడం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు. డీఎంకే పార్లమెంటరీ పార్టీ సభ్యులకు విడిగా సీట్లు కేటాయించాలని, తద్వారా సభలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కల్పించాలని ఆమె స్పీకర్ను కోరారు…కాంగ్రస్, డీఎంకే మధ్య బంధం ముగిసిపోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. మయిలడుతురై లో కాంగ్రెస్ మద్దతుదారులపై డీఎంకే మద్దతుదారులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. నిన్నా మొన్నటి వరకు స్నేహగీతం ఆలపించిన ఇరు పార్టీల నేతలు ఒక్కసారిగా ఇలా భౌదితక దాడులకు దిగడంతో అక్కడ సిట్యుయేషన్ సీరియస్ గా మారింది..
బిజెపి మైండ్ గేమ్…
కూటమిలో లొకలక్కలు మరోసారి బయటపడ్డాయి.. తమిళనాడులో సంచలనం సృష్టించిన టీవీకేకు మద్దతు తెలపడంపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..నిన్నా మొన్నటి దాకా కూటమిలో దోస్త్ మేర దోస్త్ అంటు ఇప్పుడు కనిపిస్తే దాడులే… గవర్నర్ విజయనేతృత్వంలో ఉన్న టీవీకే ప్రమాణ స్వీకారోత్సవం లేట్ చేయడంతో తమిళనాడులో రాజకీయ పార్టీలో ఓటమిలో విచ్ఛిన్న మొదలైంది.. బిజెపికి వచ్చే అంశంగా మార్చుకునే అవకాశం ఉంది…. కూటమికి మద్దతు తగ్గించడమే బిజెపి మైండ్ గేమ్ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..