బండి భగీరథ్ పైన నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కు ఆదేశాలు….
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు..!
8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు..!
_• కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వివరించారు._
_• ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి కి డీజీపీ వివరించారు._
_• కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ ని ఆదేశించారు..
: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bhagirath) పై పోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం. ఒక 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, హైదరాబాద్లోని మొయినాబాద్ ఫామ్హౌస్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వొస్తున్నాయి. ఈ వేధింపుల కారణంగా బాధితురాలు రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. చివరికి గత అర్ధరాత్రి ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, మొదట్లో బండి భగీరథ్పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడటంతో పోలీస్ స్టేషన్ వద్ద సుమారు ఆరు గంటల పాటు హైడ్రామా చోటుచేసుకుంది. ఆ తర్వాత బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇప్పటివరకు పేస్ చేయకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు..