బండి భగీరథ్ పోక్సో కేసుపై యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన పోస్టు..
నేను బీజేపీకి మద్దతు ఇస్తాను కానీ.. రేపిస్టులకు, లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదని కుండబద్దలు…
తాను సమస్యలపై కేవలం సానుభూతి చూపగలనని, పోరాడేంత శక్తి తనకు లేదని వెల్లడించిన యాంకర్..
తనను ట్యాగ్ చేసి దూషించడం వల్ల ప్రయోజనం ఉండదని.. తనని టార్గెట్ చేస్తున్న వారికి రష్మీ బదులు
తనని ట్యాగ్ చేసే బదులు ప్రభుత్వ అధికారులు, న్యాయవ్యవస్థను ట్యాగ్ చేసి న్యాయం కోరమని సూచనలు
ఈ ఘటనపై పోస్టు పెట్టినంత మాత్రాన ఎలాంటి మార్పు రాదని, తనను ట్యాగ్ చేయొద్దని వేడుకున్న రష్మీ
నటీనటులను ట్యాగ్ చేయడం ఫ్యాషన్గా మారిందని.. కానీ దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదన్న యాంకర్
రష్మీ బీజేపీ సపోర్టర్ కావడంతో.. బండి భగీరథ్ కేసుపై మౌనంగా ఎందుకున్నావని నిలదీస్తున్న నెటిజన్లు
తనని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తుండటంతో.. పై విధంగా సోషల్ మీడియా మాధ్యమంగా బదులిచ్చిన రష్మీ గౌతమ్..
లైంగిక వేధింపుల గొంతుకగా మారిన నటి చిన్మయి ఈ కేసును అంతర్జాతీయ స్థాయి వివాదాలతో పోల్చారు. అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి వారు ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారంటూ ఆమె ట్వీట్ చేశారు. అధికారం అండతో లైంగిక వేధింపులకు పాల్పడే వ్యవస్థను ఆమె తన పోస్టు ద్వారా ఎండగట్టారు.
మరో నటి పూనమ్ కౌర్ నేరుగా రాజకీయ నాయకుల నైతికతను ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, వారి కుమారులు మహిళలపై దాడులు చేయడం ఎప్పుడు ఆపుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల కంటే సమాజంలో పలుకుబడి ఉన్నవారు మరింత బాధ్యతగా మెలగాలని, కానీ ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు కావడంతో విపక్షాలు దీనిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. భగీరథ్కు వ్యతిరేకంగా పాత వీడియోలు, పోస్టులు మళ్లీ తెరపైకి రావడం అతనికి ఇబ్బందికరంగా మారింది..