గరిడేపల్లి మండల నూతన ఎస్సైగా శ్రీకాంత్ గౌడ్ నియమితులయ్యారు. జిల్లాలో జరిగిన పోలీసు అధికారుల సాధారణ బదిలీలలో భాగంగా ఆయనను గరిడేపల్లికి కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాంత్ గౌడ్ ప్రస్తుతం ఆత్మకూర్ (ఎస్) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతల పరిరక్షణలో, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో ఆయన కీలక పాత్ర పోషించి సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ అనుభవంతో ఇప్పుడు గరిడేపల్లి మండల బాధ్యతలను చేపట్టనున్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.