వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి..!

నేరేడుచర్ల మండలం కమలానగర్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది.
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన నక్క భాగ్యలక్ష్మి (27) వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది…

గొర్రెలు మేపుతున్న సమయంలో ప్రమాదం..

భాగ్యలక్ష్మి తన భర్త మొగిలయ్యతో కలిసి నెల రోజులుగా కమలానగర్ పరిసర ప్రాంతాల్లో గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం గొర్రెలు మేపుతున్న సమయంలో పోరెడ్డి వెంకటనారాయణ రెడ్డి వ్యవసాయ బావి వద్ద నీటి కోసం వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయింది.. గమనించిన భర్త మొగిలయ్య వెంటనే నేరేడుచర్ల పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై పి. సైది రెడ్డి సహాయక చర్యలను ప్రారంభించారు. గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది సహాయంతో బావిలో గాలింపు చేపట్టారు…..బావిలో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఎస్సై సైది రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు మోటార్ల సహాయంతో బావిలోని నీటిని బయటికి తొలగించి మంగళవారం మృతదేహాన్ని వెలికి తీశారు…