రష్యన్ చమురు నౌకలపై ఉన్న ఆంక్షల మినహాయింపును మరో 30 రోజులు పొడిగింపు.. !

ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, హర్మూజ్ జలసంది మూతబడడంతో సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ చమురు నౌకలపై ఉన్న ఆంక్షల మినహాయింపును మరో 30 రోజులు పొడిగిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సోమవారం ప్రకటించారు.
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, కొనుగోళ్లను కొనసాగించడానికి పలు దేశాలు మరింత సమయం కోరడంతో, రష్యా సముద్ర మార్గ చమురు వాణిజ్యాన్ని అనుమతించే ఆంక్షల మినహాయింపును యునైటెడ్ స్టేట్స్ మరో 30 రోజులకు పొడిగించింది.

“ప్రస్తుతం సముద్రంలో చిక్కుకుపోయిన రష్యన్ చమురును అత్యంత బలహీన దేశాలు తాత్కాలికంగా పొందేందుకు వీలుగా, అమెరికా ట్రెజరీ 30 రోజుల తాత్కాలిక సాధారణ లైసెన్స్‌ను జారీ చేస్తోంది,” అని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు.

“ఈ పొడిగింపు అదనపు సౌలభ్యాన్ని కల్పిస్తుంది, మరియు అవసరమైనప్పుడు నిర్దిష్ట లైసెన్సులను అందించడానికి మేము ఈ దేశాలతో కలిసి పని చేస్తాము. ఈ సాధారణ లైసెన్స్ భౌతిక ముడి చమురు మార్కెట్‌ను స్థిరీకరించడానికి మరియు అత్యంత ఇంధన కొరత ఉన్న దేశాలకు చమురు చేరేలా చూడటానికి సహాయపడుతుంది,” అని ఆయన అన్నారు. ఇంకా ఆయన, “ఇది తక్కువ ధరకు చమురును నిల్వ చేసుకునే చైనా సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా, అత్యంత అవసరమైన దేశాలకు ఇప్పటికే ఉన్న సరఫరాను మళ్లించడానికి కూడా సహాయపడుతుంది,” అని జోడించారు.

ఈ తాత్కాలిక పొడగింపుతో ప్రస్తుతం సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ చమురును ఇందన కొరత ఏర్పడిన దేశాలు తాత్కాలికంగా కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుందని బెస్సెంట్ తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన చమురు కొరతను అధిగమించడానికి అమెరికా అధికారులు ఈ మినహాయింపును పొడిగించడం ఇది రెండోసారి. గతంలో ఇచ్చిన మినహాయింపు గడువు శనివారంతో ముగియడంతో, యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కొత్త జనరల్ లైసెన్స్‌ను జారీ చేసినట్లు తెలిపారు. ఈ పొడిగింపు వల్ల రష్యా ఇంధన సంస్థలపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించకుండానే.. ట్యాంకర్లలో నిలిచిపోయిన రష్యా చమురు, పెట్రోలియం ఉత్పత్తులను తాత్కాలికంగా పొందేందుకు వీలు కలుగుతుంది.ఇందన కొరతను ఎదుర్కొంటున్న దేశాలకు ఈ పొడిగింపు ఉపశమనాన్ని కల్పిస్తుందని.. అవసరాన్ని బట్టి ఆయా దేశాలకు ప్రత్యేక లైసెన్సులు అందించడానికి తాము సిద్దంగా ఉన్నమని బెసెంట్ పేర్కొన్నారు. ప్రపంచ ముడి చమురు మార్కెట్లను స్థిరీకరించడానికి, దిగుమతి చేసుకునే ఇంధనంపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు చమురు సరఫరా సక్రమంగా అందేలా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు…