కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి పెళ్లి.. కట్ చేస్తే 17 నెలల్లోనే నవవధువు మృతి…!

పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు… 17 నెలల్లోనే కూతురు మృతి..

ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో 25 ఏళ్ల దీపిక నాగర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది.

అత్తింటి ఇంటి పైకప్పు నుంచి పడిపోయి మృతి చెందినట్టు పోలీసులు చెబుతుండగా… ఇది ఆత్మహత్య కాదు, కట్నం కోసం చేసిన హత్య అని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది.

“ఫార్చ్యూనర్ కారు, ₹51 లక్షలు కావాలని వేధించారు. పెళ్లిలోనే ₹11 లక్షల నగదు, ₹50 లక్షల బంగారం, ఫర్నిచర్, స్కార్పియో కారు ఇచ్చాం” అంటూ కన్నీటి పర్యంతమై తండ్రి మీడియా ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు..

పెళ్లైన కొద్ది నెలలకే వేధింపులు మొదలయ్యాయని… కానీ కుటుంబం కాపురం నిలబెట్టాలని ప్రయత్నించిందని పేర్కొన్నారు.

ఘటన జరిగిన రోజే దీపిక ఫోన్ చేసి తనను కొడుతున్నారని ఏడుస్తూ చెప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ కేసులో భర్త రితిక్ తన్వర్, మామ మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్న పోలీసులు… కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.