కోడగు జిల్లా దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో విషాదం
తమిళనాడులోని చెన్నైకు చెందిన 33 ఏళ్ల మహిళా పర్యాటకురాలు S. Juneshe ఈ ఉదయం దసరా ఏనుగు “కంజన్” తొక్కి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదానికి దారితీసింది.
కుటుంబంతో కలిసి కోడగుకు విహారయాత్రకు వచ్చిన ఆమె… కావೇರಿ నది ఒడ్డున ఉన్న ఏనుగుల స్నాన ప్రాంతంలో ఈ ప్రమాదానికి గురైనట్టు సమాచారం.
స్నానం చేస్తున్న “జై మార్తాండ” అనే ఏనుగుపై… “కంజన్” అకస్మాత్తుగా దాడి చేయడంతో అక్కడ కలకలం రేగింది. భయంతో పర్యాటకులు పరుగులు తీయగా… ఆ గందరగోళంలో జునేష్ ఏనుగు కాళ్ల కిందపడినట్టు తెలుస్తోంది.
ఘటనలో జునేష్ అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఏనుగు జై మార్తాండకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం.
అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉత్సాహంగా, ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన ఒక పర్యాటకుల ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. రెండు ఏనుగుల మధ్య అకస్మాత్తుగా జరిగిన ఘర్షణ కారణంగా చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ అనే మహిళ బలయ్యారు. నిత్యం వారిని విశేషంగా ఆకర్షించే ఏనుగుల స్నానాల పర్యాటకులు ఎంతో ఆనందంగా వీక్షిస్తున్న సమయంలో, క్షణాల వ్యవధిలో ఈ దారుణమైన ఘోర ప్రమాదం సంభవించింది.
ఉదయం నిత్యకృత్యంలో భాగంగా మంగళవారం మావటి ఏనుగులకు స్నానం చేయిస్తున్నారు. పర్యాటకులు కూడా సమీపంలోనే నిలబడి ఆ దృశ్యాలను ఎంతో కుతూహలంతో చూస్తున్నారు. అయితే, క్షణాల వ్యవధిలో వాతావరణం భయానకంగా మారిపోయింది. అక్కడ ఉన్న ‘కాంచన్’ అనే ఏనుగు ఒక్కసారిగా ‘మార్తాండ’ అనే మరో ఏనుగుపై దాడికి దిగింది. అక్కడ ఉన్న మావటిలు వెంటనే అప్రమత్తమై ఆ భారీ జంతువులను నియంత్రించడానికి, వాటిని విడదీయడానికి శతవిధాల ప్రయత్నించారు. కానీ, అప్పటికే పరిస్థితి చేతులు దాటిపోయింది. ఆ భీకర గందరగోళంలో ఒక ఏనుగు అదుపు తప్పి పక్కనే నిలబడి ఉన్న జ్యునేష్ అనే మహిళపై పడిపోయింది. ఆ భారీ జంతువు తిరిగి పైకి లేవడానికి ప్రయత్నిస్తే ఆమె మరింతగా తొక్కబడింది. దీనితో తీవ్రమైన గాయాలు, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పర్యాటక ఆనందాన్ని అనుభవించాల్సిన చోట ఒక కుటుంబంలో తీరని శోకం మిగిలింది..