తెల్ల తోలు అహంకారం…తేనె పూసిన కత్తిల నార్వే జర్నలిస్ట్ వ్యవహార శైలి..!..!

నెదర్లాండ్ వ్యవహార శైలి చాలా చిత్రంగా ఉంది… మనిషి ముందు ఒక మాట.. మనిషి వెనుక ఒక మాట మాట్లాడిన ఆ దేశం.. ఇప్పుడు భారత్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నది.

ప్రస్తుతం మోదీ నార్వే, నెదర్లాండ్స్ దేశాలలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు ముందుగానే నెదర్లాండ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్ మతి లేని వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మైనారిటీల హక్కులు బాగోలేవట. పత్రికలకు స్వేచ్ఛ లేదట. చట్టబద్ధమైన పరిపాలన సాయుగడం లేదట. పైగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలలో దీనిపై ఆందోళన ఉందట. ఈ వ్యాఖ్యలను ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్స్ లో పర్యటించడానికి ముందు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు నెదర్లాండ్స్ పర్యటన ను మోడీ ముగించుకున్న తర్వాత స్వీడన్ వెళ్లిన తర్వాత మీడియాలో కనిపించడం విశేషం. పైగా ముస్లింల మీద భారతదేశంలో తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని.. ముస్లింలు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారని నెదర్లాండ్ ప్రధాని చెప్పడం విశేషం.

నెదర్లాండ్ ఆర్థికంగా ఒకప్పుడు స్థితివంతమైన దేశం కాదు. యూరోపియన్ యూనియన్ లో దేశమైన నెదర్లాండ్ పత్రిక స్వేచ్ఛలో ఏ ర్యాంకులో ఉంది.. చట్టబద్ధమైన పరిపాలనలో ఏ స్థాయిలో ఉంది. నెదర్లాండ్ జనాభా ఎంత.. భారత్ జనాభా ఎంత.. నెదర్లాండ్ ప్రధాని చెప్పినట్టుగా భారతదేశంలో మైనారిటీల మీద ఆ స్థాయిలో దాడులు జరుగుతుంటే.. పాకిస్తాన్లో ముస్లింలు భారత్ వస్తామని ఎందుకంటారు.. బలూచిస్తాన్ ప్రాంతంలో ముస్లింలు తమను భారత దేశంలో కలపాలని ఎందుకు డిమాండ్ చేస్తారు.. అక్కడిదాకా ఎందుకు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. దానిని ఆపే సత్తా కేవలం మోడీకి మాత్రమే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్ స్కి అభిప్రాయపడ్డారు. యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశమైనప్పటికీ నెదర్లాండ్స్ ను యుద్ధం ఆపాలని కోరలేదు. దీనిని బట్టి భారత్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు అంటు పలువురు నెదర్లాండ్స్ పై విమర్శలు గుర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..

నెదర్లాండ్ యూరోపియన్ యూనియన్ లో భాగం. ఒకప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్ మీద పడి ఎలా దోచుకున్నాయో అందరికీ తెలుసు. వర్తకం పేరుతో దోపిడీకి పాల్పడి.. ఇప్పుడు భారతదేశానికి నీతులు చెబుతున్న నెదర్లాండ్ ప్రభుత్వం తీరు పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. భారతదేశ మీద పడి పీకుతున్న మీరా.. మమ్మల్ని ప్రశ్నించేది.. తెల్ల తులు నాయాల్లారా అంటూ సోషల్ మీడియాలో భారతీయులు నెదర్లాండ్ మీద విపరీతంగా విమర్శలు చేస్తున్నారు.. మరోవైపు నెదర్లాండ్ ప్రధాని భారత్ మీద చేసిన విమర్శలకు.. మన దేశ విదేశీ విభాగం గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నార్వే పర్యటనలో ఆ దేశ విలేకరి ప్రశ్నకు స్ట్రాంగ్ సమాధానం ఇచ్చింది..”అసలు మీరెవరు
.. మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం మాకు ఏంటి. మానవ హక్కులను మీరు కాపాడతారని హామీ ఇస్తారా.. ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. భారత్ అనే దేశాల కంటే ముందుగానే మహిళలకు ఓటు హక్కు కల్పించింది. మానవ హక్కుల పరిరక్షణకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది. మనుషులను కాల్చి చంపుతున్న దేశాల కంటే భారత్ తీసి పోలేదు. భారత దేశంలో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. అందువల్లే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ కొనసాగుతోంది. ఈ విషయం మర్చిపోతే ఎలా అంటూ” భారత విదేశాంగ శాఖ ప్రశ్నించింది..

“ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన పత్రికారంగం నుండి మీరు కొన్ని ప్రశ్నలు ఎందుకు తీసుకోరు?” అని జర్నలిస్ట్ హెలె లింగ్ గట్టిగా అరిచారు. ప్రధాని మోదీ ఆ ప్రశ్న విన్నారో లేదో స్పష్టంగా తెలియకపోయినా, ఆయన గది నుండి వెళ్లిపోయారు. ఆ ఒక్క సంఘటన పత్రికా స్వేచ్ఛపై చర్చను రేకెత్తించడానికి సరిపోయింది. ఈ వివాదం మధ్య, ఇప్పుడు అందరి దృష్టి లింగ్ మీదే మరియు ఆమె సోషల్ మీడియా కార్యకలాపాల మీదే పడింది..