దంచికొట్టిన సన్‌రైజర్స్‌..ఆర్‌సీబీపై సన్‌రైజర్స్ ఘన విజయం..

ఐపీఎల్ 2026 సీజన్‌ ప్లేఆఫ్స్ బెర్తులపై ఓ క్లారిటీ వచ్చింది. హైదరాబాద్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్, నెట్ రన్ రేట్ కారణంగా మే 27న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. టేబుల్ టాప్ 2లో ముగించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మే 26న క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతుంది..

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాట్ కమిన్స్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించాలంటే 120 బంతుల్లో 256 పరుగులు చేయాల్సి ఉంది…

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తొలి 3 ఓవర్లలోనే 33 పరుగులు జోడించారు. . ఇషాన్‌ కిషన్‌ (46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79), అభిషేక్‌ శర్మ (22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), హెన్రిచ్‌ క్లాసెన్‌ (24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51) విజృంభించడంతో ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. తొలుత హైదరాబాద్‌ 255/4 స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ సహా ముగ్గురు 50 ప్లస్‌ రన్స్‌ ఇచ్చుకున్నారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ ఓవర్లన్నీ ఆడి 200/4 చేసి ఓడింది. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56), వెంకటేశ్‌ అయ్యర్‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 44) జట్టు భారీ తేడాతో ఓడిపోకుండా చూసి టాప్‌ ప్లేస్‌ ఖాయం చేశారు. ఇషాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఆర్సీబీ, గుజరాత్‌, హైదరాబాద్‌ తలో 18 పాయింట్లతో నిలిచినా.. రన్‌రేట్‌లో వెనుకబడిన హైదరాబాద్‌ మూడో స్థానానికి పరిమితం అయింది. ఆర్సీబీ, జీటీ ఈ నెల 26న క్వాలిఫయర్‌-1 ఆడనుండగా.. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో 27న రైజర్స్‌ ఎలిమినేటర్‌లో పోటీ పడుతుంది
అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ బాధ్యతాయుతమైన ఆటతీరుతో పాటు మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ కేవలం 31 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఈషాన్ కిషన్ 78 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి పెవిలియన్ చేరాడు..మిడిల్ ఓవర్లలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ పరుగుల వేగాన్ని మరింత పెంచాడు. ఈషాన్ కిషన్‌తో కలిసి విధ్వంసకర భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి ధాటికి ఇన్నింగ్స్ 16వ ఓవర్లోనే హైదరాబాద్ జట్టు 200 పరుగుల మైలురాయిని దాటింది. కేవలం 5 ఓవర్ల వ్యవధిలోనే ఈ జోడి 81 పరుగులు రాబట్టడం విశేషం. క్లాసెన్ కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆఖర్లో నితీష్ కుమార్ రెడ్డి 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచి స్కోరును 255కు చేర్చాడు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరుకు మొదటి స్థానంతో పాటు ఫైనల్‌కు వెళ్లడానికి రెండు అవకాశాలు లభిస్తాయి. మరోవైపు హైదరాబాద్ జట్టు కూడా ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. అయితే టేబుల్‌లో రెండో స్థానాన్ని అందుకోవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్‌ను భారీ రన్ రేట్ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్ జట్టు 0.695 నెట్ రన్ రేట్‌తో ముందంజలో ఉండగా, హైదరాబాద్ 0.350 రన్ రేట్‌తో ఉంది…

భారీ ఛేదనలో ఆర్‌సీబీ తడబడింది. హిట్టింగ్‌ కోసం ఓపెనర్‌గా బరిలోకి దిగిన వెంకటేశ్‌ అయ్యర్‌తో పాటు మధ్య ఓవర్లలో రజత్‌ పటీదార్‌, క్రునాల్‌ పాండ్యా ఆకట్టుకున్నారు. కానీ రైజర్స్‌ బౌలర్లు ఆరంభం నుంచే మ్యాచ్‌ను అదుపులో ఉంచారు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరగడంతో బెంగళూరు చేసేదేమీ లేకపోయింది. తొలి ఓవర్‌లోనే అయ్యర్‌ 4,6 బాదగా.. నాలుగో ఓవర్‌లో 6,4,6,6తో 23 రన్స్‌ రాబట్టాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే అతడిని పేసర్‌ మలింగ అవుట్‌ చేశాడు. అటు వచ్చీ రాగానే దేవ్‌దత్‌ పడిక్కళ్‌ 4,6తో జోరు చూపాడు. ఇక ఆరో ఓవర్‌లో కోహ్లీ(15)ని పేసర్‌ సకీబ్‌ దెబ్బతీయగా.. పవర్‌ప్లేలో ఆర్‌సీబీ 75/2తో నిలిచింది. అనంతరం పరుగులు నెమ్మదించగా.. దేవ్‌దత్‌ (21)ను మలింగ అవుట్‌ చేశాడు. ఈ దశలో రజత్‌-క్రునాల్‌ జోడీ రైజర్స్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంది. గెలుపుపై ఆశలు లేకపోవడంతో వీరు వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అడపాదడపా బౌండరీలతో ముందుకు సాగారు. మరోవైపు 17వ ఓవర్‌లో స్కోరు 166 దగ్గర ఆర్‌సీబీ టాప్‌-2 బెర్త్‌ ఖాయమైంది. హాఫ్‌ సెంచరీ తర్వాత రజత్‌ 19వ ఓవర్‌లో వెనుదిరిగాడు. నాలుగో వికెట్‌కు క్రునాల్‌-రజత్‌ 84 రన్స్‌ జోడించారు. 6 బంతుల్లో 71 రన్స్‌ కావాల్సిన వేళ.. 15 రన్స్‌కే పరిమితమైన బెంగళూరు 200 స్కోరు చేసి ఓడింది..

స్కోర్లు
సన్‌రైజర్స్‌: 20 ఓవర్లలో 255/4 (ఇషాన్‌ 79, అభిషేక్‌ 56, క్లాసెన్‌ 56, రసిఖ్‌ దార్‌ 2/52);

బెంగళూరు: 20 ఓవర్లలో 200/4 (రజత్‌ 56, వెంకటేశ్‌ 44, ఈషాన్‌ మలింగ 2/33)