ఉద్యోగాల పేరుతో మహిళలతో అక్రమ సంబంధాలు..?
లెక్చరర్ భర్తకు దేహశుద్ధి చేసిన భార్య.
మచిలీపట్నం :: కృష్ణా జిల్లా బందరు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ ప్రైవేటు కళాశాల కెమిస్ట్రీ అధ్యాపకుడు జాషువాపై అతని భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. అవనిగడ్డ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న జాషువా, విద్యార్థులకు మహిళలకు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పి లోబరుచుకుంటున్నాడని భార్య ఆరోపించింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న జాషువా బందరు ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మహిళలకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించి తన ఇంటికి తీసుకు వెళ్లి లోబరుచుకుంటున్నాడని గ్రహించిన భార్య జాషువా వ్యవహారంపై నిఘా పెట్టింది. భర్త కదలికలను గ్రహించిన భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అక్కడే భర్తకు దేహ శుద్ధి చేసింది. భర్తపై భార్య అనేక ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమైంది. ఉద్యోగాల పేరుతో పలువురు మహిళలను మోసం చేస్తున్నాడని, తనను కూడా మానసికంగా వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే భార్య చేసిన ఆరోపణల పై పోలీసులు పూర్తి విచారణ చేపట్టనున్నారు.