మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
రెండు వారాల వ్యవధిలో మూడోసారి ధరల పెంపు
పెట్రోల్పై రూ.0.87, డీజిల్పై రూ.0.91 పెరిగిన ధరలు..
మరోసారి ఇంధన ధరల భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్పై 94 పైసలు, లీటర్ డీజిల్పై 96 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి..
ఈ సవరించిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో దేశంలో ఇంధన ధరలు పెరగడం ఈ మధ్యకాలంలో ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
ఈ నెలలోనే మూడో వాత:
రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇంధన డీలర్ల సమాచారాన్ని బట్టి పెట్రోల్ ధర లీటరుకు రూ. 0.87, డీజిల్ ధర లీటరుకు రూ. 0.91 పెరిగింది (ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి). ఈ నెలలోనే ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి. ఈ వారంలోనే అంతకుముందు లీటరు పెట్రోల్, డీజిల్పై 90 పైసలు పెంచగా, అంతకంటే కొన్ని రోజుల ముందే ఏకంగా రూ. 3 వరకు పెంచారు. ఈ ధరల సవరణకు ముందు తాము నెలకు దాదాపు రూ. 1,000 కోట్ల మేర నష్టాలను భరిస్తున్నామని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి.
ధరల పెరుగుదలకు కారణాలు:
ప్రస్తుతం పశ్చిమాసియా (Middle East) లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఘర్షణల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా దూసుకుపోవడమే ఈ తాజా ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85% వాటాను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ప్రపంచ చమురు మార్కెట్లో జరిగే ఎలాంటి చిన్న మార్పులైనా దేశీయ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.
అంతర్జాతీయ మార్కెట్ సరళి..
అమెరికా-ఇరాన్ శాంతి చర్చల పురోగతిపై పెట్టుబడిదారులలో నెలకొన్న అనుమానాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.66 డాలర్లు (1.6%) పెరిగి బ్యారెల్కు 104.24 డాలర్లకు చేరుకోగా, యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ఫ్యూచర్స్ 1.11 డాలర్లు (1.2%) పెరిగి 97.46 డాలర్ల వద్ద ముగిశాయి. అయితే, వారపు ప్రాతిపదికన చూస్తే శాంతి ఒప్పందంపై అంచనాలు మారుతుండటంతో ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దీనివల్ల వారాంతానికి బ్రెంట్ క్రూడ్ 4.6%, WTI 7.6% మేర తగ్గాయి.
రష్యా చమురు ప్రయోజనాలు తగ్గడమే కారణమా?:
గడిచిన రెండేళ్లుగా భారతదేశం రష్యా నుంచి రాయితీ (డిస్కౌంట్) ధరకే లభిస్తున్న ముడి చమురుపై ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. దీనివల్ల దేశీయంగా దిగుమతి ఖర్చులను అదుపులో ఉంచడం సాధ్యమైంది. అయితే, ప్రస్తుతం రష్యా నుంచి లభిస్తున్న ఆ ధరల ప్రయోజనం క్రమంగా తగ్గుతుండటం, అదే సమయంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు 111 యూఎస్ డాలర్లకు చేరువవుతుండటంతో.. ఇన్నాళ్లూ ధరలను మార్చకుండా యథాతథంగా ఉంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇప్పుడు దేశీయంగా ఇంధన ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది..