మధు ది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే..హత్య రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదు.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
*సూర్యాపేట జిల్లా..*
కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు మృతదేహానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్ గుండాల హత్యలను తీవ్రంగా కండిస్తున్నాం..
మధు ది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే..
ఈ హత్యలో పోలీసుల భాగస్వామ్యం ఉందనే అనుమానం..
హత్య రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదు..
కెసిఆర్ హయాంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండే..
పదేండ్ల BRS పాలనలో ప్రశాంత వాతావరణాన్ని పెంపొందించినం..
పూర్వం కక్షలకు నిలయంగా ఉన్న జిల్లా నల్లగొండ..
కాంగ్రెస్ లోనే అంతర్గత విభేదాలు తోటి వందలాది హత్యలు చేసుకున్న జిల్లా..
ఆనాడు ఎన్నికలోస్తే ఎన్ని హత్యలు జరుగుతాయన్న దారుణమైన పరిస్థితి ఉండే..
కెసిఆర్ నాయకత్వంలో శాంతిభద్రతలను పూర్తిగా అదుపులో ఉంచినం..
పోలీసులను కూడా పూర్తిగా స్వేచ్ఛాయిత వాతావరణంలో పని చేసుకునే వీలు కల్పించినం..
శాంతిభద్రతల విషయంలో ఏనాడు మేము జోక్యం చేసుకోలేదు..
కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చి రెండున్నరేళ్లుగా ఎన్నో అరాచకాలు చూస్తున్నాం..
కాంగ్రెస్ గుండాలు, రౌడీల చేతుల్లోనే పోలీస్ స్టేషన్ నడుస్తున్నాయి..
రెండున్నర ఏళ్లుగా సూర్యాపేటలోనూ పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులను స్టేషన్లకు పిలిపించి మరీ కాంగ్రెస్ గుండాల ముందు నిలబెట్టి అవమాన పరుస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆ పార్టీకి తొత్తులుగా పోలీసులు మారడం సిగ్గుచేటు..
ప్రజా సమస్యలపై పోయిన మా పార్టీ ప్రజా ప్రతినిధులను సైతం అవమానాల పాలు చేస్తున్నారు..
అనేక సందర్భాలలో పోలీసు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు..
కాంగ్రెస్ నాయకులే దాడులు చేసుడు.. ముందుగా స్టేషన్ లపై వారే కేసులు పెడుతున్నారు..
గతంలోనూ ఇదే కాంగ్రెస్ గుండాలు మా పార్టీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న ను దారుణంగా హత్య చేసిండ్రు..
ఆరోజు కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సమయమనం పాటించాలని చెప్పినం..
ఆ కేసులో ట్రైల్, సాక్షాలు నడుస్తున్న క్రమంలో మధుతోపాటు ఇతర సాక్షులను భయపెట్టే ప్రయత్నం చేసిండ్రు..
ఈ కేసులో సడన్ గా పీపీ ని మార్చడం దుర్మార్గమైన చర్య..
కేసును బలహీనం చేయడం కోసమే పీపీ ని మార్చిండ్రు..
మధును నువ్వు ఎగిరిపోతావని స్వయంగా ఎస్ఐ చెప్పడం అంటేనే అర్ధమవుతుంది..
అటువంటి వ్యాఖ్యలు చేసిన ఎస్ఐకి మధును కాపాడే బాధ్యత లేదా..
మధును నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేసిండ్రు..
ఈ హత్యకు కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారులే బాద్యులు..
కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో.. రిమాండ్ రిపోర్ట్ లో ఏం చూపిస్తారో చూస్తాం..
అప్పటివరకు బిఆర్ఎస్ శ్రేణులు సమయమునం పాటించాలి..
ఈ కేసు విషయంలో పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే తర్వాతైనా కేసుల్ని తిరగతోడుతాం..
విచారణలో తప్పుచేస్తే ఐజీ స్థాయి అధికారులను కూడా పదేళ్ల తర్వాత జైళ్లకు పంపిన ఘటనలు ఎన్నో చూసినం..
నిజమైన నిందితులెవరో వారిని గుర్తించి సరైన శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు పనిచేయాలి..
ఈ కేసు విషయంలో నిమిషం నిమిషం ఏం జరుగుతుందో పరిశీలిస్తాం..
తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఏ అధికారినైనా వదిలిపెట్టం..
ఈ కేసులో నిందితులకు చట్టప్రకారమే శిక్ష పడే విధంగా ప్రయత్నం చేద్దాం..
అలాగే మధు కుటుంబానికి అండగా నిలబడతాం..
ఇద్దరు ఆడపిల్లలకు చదువుల బాధ్యత, కుటుంబ పోషణ విషయంలో బిఆర్ఎస్ పార్టీగా బాధ్యత తీసుకుంటాం..
ఒంటెద్దు వెంకన్న కుటుంబానికి ఏ విధంగా నిలిచామో.. అదేవిధంగా మధు కుటుంబానికి కూడా అండగా నిలబడతాం..