గుజరాత్‌పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ..!

ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫైయర్ మ్యాచులో RCB గుజరాత్ ను చిత్తుగా ఓడించి, ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగుకు దిగిన బెంగుళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్(93) పరుగులు చేసి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం 255 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్.. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ తడబడ్డారు. సుదర్శన్(14), గిల్(2) పరుగులకే అవుటయ్యాడు. అనంతరం వచ్చిన బట్లర్(29) పరుగులతో రాణిస్తుండగా.. హేజల్ వుడ్ చేతిలో ఔట్ అయ్యాడు.బెంగుళూరు నిర్నిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 254 పరుగుల భారీ టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ ముందు ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెత్త ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్, చిత్తుగా ఓడిపోయింది. ప్రతి మ్యాచ్ లో అదరగొడుతున్న ఓపెనర్లు ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ హిట్ వికెట్ ( Sai Sudharshan hit wicket) మాత్రం చాలా బాధాకరం.

జాకబ్ డఫీ వేసిన ఓ అద్భుతమైన బంతిని… బౌండరీ బాదాడు సాయి సుదర్శన్. అక్కడి వరకు బాగానే ఉంది, బౌండరీ కొట్టిన సాయి సుదర్శన్ (Sai Sudharshan ) బ్యాట్ వదిలేసాడు. ఇంకేముంది ఆ బ్యాట్ వెళ్లి వికెట్ల పైన పడింది. దీంతో హిట్ వికెట్ కింద సాయి సుదర్శన్ వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పతనం మొదలైంది. రాహుల్ తెవాతియా ఒక్కడే అర్థ సెంచరీ తో మెరుపులు మెరిపించినా… ఫలితం దక్కలేదు. ఛేజింగ్ చేసే క్ర‌మంలో 19.3 ఓవ‌ర్లు ఆడిన గుజ‌రాత్…162 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది.

భారీ కొండలాంటి లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఓపెనర్ సాయి సుదర్శన్ (14) విచిత్రమైన రీతిలో ‘హిట్ వికెట్’ కాగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ (2)ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్ (29) రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో కౌంటర్ ఎటాక్ చేయడానికి ప్రయత్నించాడు జోష్ హేజిల్‌వుడ్ అతడిని అవుట్ చేసి గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికే రాసిఖ్ సలామ్ ఒకే ఓవర్‌లో నిశాంత్ సింధు (5), జాసన్ హోల్డర్ (0)లను అవుట్ చేసి ‘డబుల్ వికెట్ మెయిడెన్’ సాధించడంతో గుజరాత్ 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర పరాజయంలో పడింది. వాషింగ్టన్ సుందర్ (8), రషీద్ ఖాన్ (8)లు కూడా తక్కువ స్కోరుకే డఫ్ఫీ బౌలింగ్‌లో వెనుదిరిగారు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా లోయర్ ఆర్డర్ బ్యాటర్ రాహుల్ తెవాటియా అద్భుతమైన పట్టుదలతో ఒంటరి పోరాటం చేశాడు. ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొంటూ 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. అయితే 19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ అతడిని అవుట్ చేయడంతో గుజరాత్ కథ ముగిసింది. ఈ వికెట్‌తో భువనేశ్వర్ మళ్లీ ‘పర్పుల్ క్యాప్’ను దక్కించుకున్నాడు. చివరి ఓవర్‌లో కృనాల్ పాండ్య వేసిన బంతికి సిరాజ్ (5) భారీ షాట్‌కు ప్రయత్నించారు, టిమ్ డేవిడ్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను ముగించారు.

ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుండి పూర్తిగా ముగిసింది. లీగ్ స్టేజ్‌లో టాప్ 2లో నిలవడం వల్ల వారికి మే 29న కొత్త చండీగఢ్‌లో జరిగే క్వాలిఫైయర్-2లో ఆడేందుకు మరో అవకాశం ఉంది. అక్కడ వారు రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ల మధ్య జరిగే ఎలిమినేటర్ విజేతతో తలపడనున్నారు. మ్యాచ్ అనంతరం గుజరాత్ క్యాప్టెన్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, తమ ఫీల్డింగ్ , మ్యాచ్‌లు అందుకోవడంలో వైఫల్యం చెందామని, ఈ మ్యాచ్‌ను త్వరగా మర్చిపోయి క్వాలిఫైయర్-2 కోసం సరికొత్తగా సిద్ధమవుతామని తెలిపాడు. ఆర్సీబీ మాత్రం నాలుగు రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మే 31న ఫైనల్ పోరులో తలపడనుంది…

దీంతో బెంగళూరు ఫైనల్స్ కు వరుసగా రెండోసారి దూసుకువెళ్లింది. గుజరాత్ టైటాన్స్ జట్టుపైన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… మే 31వ తేదీన ఫైనల్స్ ఆడనుంది. అహ్మదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ బిగ్ ఫైట్ ఉండనుంది.

ఇక అటు మే 29వ తేదీన క్వాలిఫైయ‌ర్ 2 లో భాగంగా హైద‌రాబాద్ / రాజ‌స్థాన్ ల‌లో ఓ జ‌ట్టుతో గుజ‌రాత్ త‌ల‌ప‌డ‌నుంది…