భారతదేశానికి చెందిన మామిడి పండ్ల దిగుమతిని జపాన్ ఈ ఏడాది మామిడి సీజన్లో నిలిపివేసింది. 20 ఏండ్లలో తొలిసారిగా భారతీయ మధుర ఫలాలపై జపాన్ నిషేధం అమలులోకి వచ్చింది…
జపాన్ ఈ కఠోర నిర్ణయానికి తీసుకోవడం వెనుక కారణం ఉంది. భారతదేశంలో పండ్ల చెట్లకు తెగుళ్ల నివారణ చర్చలలో నిర్లక్షం, తప్పిదాలు ఉన్నట్లు జపాన్ అధికారులు గుర్తించారు. ఇటువంటి పండ్లు తమ దేశంలోకి వస్తే తమ దేశీయ వ్యవసాయ రంగానికి ఇక్కట్లు ఏర్పడుతాయని నిర్థారించారు.
ప్రస్తుత సీజన్కు భారతదేశం నుండి మామిడి దిగుమతులపై జపాన్ పూర్తి నిషేధాన్ని ప్రకటించడంతో భారతీయ మామిడి ఎగుమతిదారులు తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. గుర్తింపు పొందిన భారతీయ కేంద్రాలలో క్వారంటైన్ మరియు చికిత్సా విధానాలలో తీవ్రమైన లోపాలను జపాన్ తనిఖీ బృందాలు కనుగొన్నట్లు నివేదికలు రావడంతో ఈ నిర్ణయం వెలువడింది. ఇప్పటికే తగ్గుతున్న విదేశీ డిమాండ్, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో ఈ పరిశ్రమ సతమతమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం అత్యంత క్లిష్టమైన సమయంలో వచ్చిందని ఎగుమతిదారులు అంటున్నారు…
భారత్లోని ట్రీట్మెంట్ ప్లాంట్లను ఈ ఏడాది ఆరంభంలో జపాన్ బృందాలు తనిఖీలు చేశాయి. భారత్ నుంచి ఈ వేసవిలో మామిడి దిగుమతిని నిలిపివేశారు. ఈ క్రమంలో భారతీయ మామిడి రకాలు అల్ఫ్న్సో, లంగ్రా, బంగన్పల్లి మామిడి పండ్ల మార్కెట్కు జపాన్లో బ్రేక్ పడింది. దీనితో ఈ రకం పండ్ల తోటల వ్యవసాయదారులు ఉసూరుమంటున్నారు. వీరి లాభాలకు గండిపడింది..