యాదాద్రి భువనగిరి జిల్లా
భూదాన్ పోచంపల్లిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన…
రహదారిపై ధాన్యం పోసి ఆందోళనకు దిగిన బిఆర్ఎస్ నాయకులు…
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అలసత్వాన్ని నిరసిస్తూ ధర్నా…
రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నేతలు…
కొనుగోలు ప్రక్రియలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం…
జాతీయ రహదారులను నిర్బంధం చేస్తామని హెచ్చరిక..
ధర్నా కార్యక్రమం కారణంగా రహదారిపై ట్రాఫిక్ జామ్..
యాదాద్రి భువనగిరి జిల్లా
ఆలేరు మండలం లోని కొలనుపాక గ్రామం లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన…
ఆలేరు – సిద్దిపేట రహదారిపై ధాన్యం పోసి ఆందోళనకు దిగిన బిఆర్ఎస్ నాయకులు…
రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నేతలు…
కొనుగోలు ప్రక్రియలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం…
జాతీయ రహదారులను నిర్బంధం చేస్తామని హెచ్చరిక..
ధర్నా కార్యక్రమం కారణంగా రహదారిపై ట్రాఫిక్ జామ్..
*రైతుల పాలిట శాపంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం..
…యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు భారీ నిరసన చేపట్టారు. రహదారిపై ధాన్యం పోసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అలసత్వం కొనసాగుతోందని రైతులు మండిపడ్డారు.
భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు రహదారిపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ధాన్యం పోసి నిరసన తెలిపారు.
అనంతరం రైతులు సంఘల నాయకులు మాట్లాడుతూ….కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేసారు.
40 రోజులకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూదాన్ పోచంపల్లి మండల వ్యాప్తంగా సుమారు 19 లక్షల వరి ధాన్యం బ్యాగులు రావాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 9 లక్షల బ్యాగుల వరకే కొనుగోలు జరిగిందని తెలిపారు. ఇంకా 50 శాతం వరకు ధాన్యం కొనుగోలు పెండింగ్లోనే ఉందన్నారు.
మరో వారం రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండగా ఇంకా ఎప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు సమన్వయంతో పని చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు..తక్షణమే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేకపోతే భారీ ఎత్తున జాతీయ రహదారుల నిర్బంధానికి దిగుతామని రైతులు హెచ్చరించారు..