ఏపీలో మరో బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు..

ఏపీలో మరో బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు

వైయస్సార్ జిల్లా గోపవరం మండలం పిపికుంట సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా బస్సు తిరగబడటంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు మరియు పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్సుల ద్వారా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమా? లేక సాంకేతిక లోపమా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.