బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.

సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి సాధించిన విజయాలను స్మరించుకునే గర్వకారణమైన రోజు, అనేక మంది అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనీ వారి త్యాగాలను ఈ సందర్భంగా మనం కృతజ్ఞతతో స్మరించుకోవాలి.
తెలంగాణ ఏర్పడిన తరువాత వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటి అనేక రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగింది. రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉండే సమాజ నిర్మాణమే మన లక్ష్యం కావాలని
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ, రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచి బిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అంటే బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షిచారు.