ఢిల్లీలో నేడు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో పాల్గొనేందుకు సీజెపి ఫౌండర్ అభిజీత్ దిప్కే యూస్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
_• ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు._
_• జంతరంతర్లో నిరసనలు చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతిచ్చారని సీజెపి ప్రకటించింది._
_• శాంతియుతంగా నిరసన చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చింది._
Cockroach Janata Party.
_• ఈ నిరసనలకు అనుమతిపై తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని పోలీసులు చెబుతున్నారు….
ఢిల్లీ వ్యాప్తంగా శనివారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డిజిటల్ గ్రూప్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసన పిలుపునివ్వడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI), జంతర్ మంతర్, సరిహద్దు ప్రాంతాలతో పాటు కీలక కూడళ్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వెయ్యి మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు..నిరసన కార్యక్రమానికి నిరసనకారులు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. “వారు అనుమతి కోరినప్పుడు ఆ విజ్ఞప్తిని పరిశీలిస్తాం” అని ఒక సీనియర్ పోలీస్ అధికారి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారాన్ని బట్టి పోలీసులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెలుపల బారికేడ్లను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (IGI) విచిత్ర వీర్ నేతృత్వంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు..