బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త.. !

బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త.. ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మరింత తగ్గాయి. హైదరాబాద్‌లో నేడు(మంగళవారం, జూన్ 9) బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులు, వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజా మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర గ్రాముకు రూ.15,168గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల (91.6 శాతం స్వచ్ఛత) బంగారం ధర గ్రాముకు రూ.13,904గా ఉండగా, 18 క్యారెట్ల (75 శాతం స్వచ్ఛత) బంగారం ధర గ్రాముకు రూ.11,376గా ఉంది..