రేపు ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలో ఏఐసీసీ అత్యవసర సమావేశం
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జ్లు, పీసీసీ అధ్యక్షులు హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు
సర్క్యులర్ జారీ చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్..
కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి (Abhishek Manu Singhvi) ఎన్నికల సంఘం, కోర్టుల ఎదుట బలమైన వాదనలను వినిపించబోతున్నారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు కూడా ఆ కేసును ఇంకా విచారణకు స్వీకరించలేదని క్లారిటీ ఇచ్చారు. ఆమెకు కోర్టు పంపింది ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమేనని తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A ప్రకారం.. ఓ అభ్యర్థి తనపై ఉన్న కేసులను అఫిడవిట్లో కోర్టు సదరు కేసును స్వీకరించి, కనీసం 2 శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల కింద చార్జీలు (Charges) ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే మెన్షన్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. మీనాక్షి విషయంలో ఆ రెండు జరగలేదు కాబట్టి, ఆమె అఫిడవిట్లో ఆ నోటీసు గురించి రాయాల్సిన అవసరం లేదని, రిటర్నింగ్ అధికారి చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అభిషేక్ మను సింఘ్వి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.