తెలంగాణ, ఏపీని కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు సరిగ్గాలేదు…పవన్ కళ్యాణ్.

తెలంగాణ, ఏపీని కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు సరిగ్గాలేదు..

కాంగ్రెస్ పార్టీ ఇంకా మారలేదు.. దానికి ఉదాహరణ జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడం – పవన్ కళ్యాణ్.

ఇప్పటివరకు కూడా ఆస్తులు పంపకాలు సరిగ్గా లేవు.. విడదీసిన పద్ధతి సరిగ్గా లేదు.. అప్పటి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు ఆ అంశం అనవసరమైన కానీ ఇటీవల తన సవని అడ్డుకోవడంలో అది కూడా ఓ భాగమైనది అన్నాడు.. ఎప్పుడైనా ఓ చిన్న చూపు ఉందని ప్రాంతాలుగా విడిపోయిన మనుషులు ఎప్పుడు కలిసే ఉంటున్నారని అది కాంగ్రెస్ పార్టీకే అర్థం కావడం లేదని అన్నారు… ఇప్పటికి చాలా పంపకాలు అలానే పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా పంపకాలు పూర్తి చేయాలని అన్నారు…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభోపన్యాసం చేశారు. జాతీయ సమైక్యతపై జనసేనాని దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీని ప్రారంభించి 12 ఏళ్లు పూర్తైందని తెలిపారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామని గుర్తుచేసుకున్నారు. అధికారంలోకి రావాలన్న ఆశతో పార్టీ పెట్టలేదని.. దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ బాగుపడాలంటే.. దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ మనుగడ కోసం కొన్ని పార్టీలు దేశ సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని తెలిపారు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు..తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదని పవన్ వెల్లడించారు. ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరుపైనే ఆవేదన వెలిబుచ్చామని వివరించారు. తెలంగాణ విభజనకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదన్నారు. కాంగ్రెస్ విభజించిన తీరు.. అసంతృప్తి, అశాంతిని సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆస్తుల పంపిణీ, తదితర సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఢిల్లీ మెడలు వంచుతామని చాలా మంది మాట్లాడుతున్నారని.. కానీ ఢిల్లీకి రాగానే ఎవరి నోర్లు పెగలవని దుయ్యట్టారు. దేశ రక్షణకు, భద్రతకు ప్రధాన కేంద్రం ఢిల్లీ అని తెలిపారు. స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు ఈ గడ్డ నిలయమన్నారు. రాజ్యాంగం పుట్టిన చోటు కాబట్టే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల కీలక నాయకులు హాజరయ్యారు..