ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు..!

12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సర్దార్ పటేల్ స్టేడియం ఖమ్మం లో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఖమ్మం జిల్లా కలెక్టర్ T.S.DIVAKAR, IAS (టీఎస్ దివాకర్ IAS). హాజరు అయినారు. ఆయుష్ డిపార్ట్మెంట్ వారు యోగమాత ప్రోటోకాల్ యోగసనాలు, ప్రాణాయామం, ధ్యానం,చెప్పటం జరిగినది,యోగాచార్యులు షేక్. బహార్ అలీ మరియు ఆయుష్ డిపార్ట్మెంట్ YOGA instructors తో చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో యోగ సాధకులకు, యోగ ప్రేమికులు, సోదరసోదరిమణులు, వాకర్స్, విద్యార్థిని విద్యార్థులు, మహిళా మహారాణులు, వృద్ధులు,పాల్గొన్నారు. సిద్ధార్ధ యోగ విద్యాలయం,మైనారిటీ స్కూల్, విద్యార్థిని విద్యార్థులు యోగసనాలు చక్కగా వేసి ప్రదర్శించటం జరిగినది.గురుదక్షణ ఫౌండేషన్ వారు మరియు బ్రాహ్మ కుమారి సమాజం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను ఖమ్మం ఆయుష్ డిపార్ట్మెంట్, మరియు యువజన క్రీడాల శాఖవారు, ఖమ్మం యోగ ధ్యాన సమాఖ్య వారు నిర్వహించటం జరిగినది…