Bullet Train: హైదరాబాద్, అమరావతి, చెన్నై హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు)..

Bullet Train:
జస్ట్ 70 మినెట్స్.. అమరావతి .

దక్షిణ భారతదేశ రవాణా రంగంలో మరో కీలక అధ్యాయం మొదలవబోతోంది. హైదరాబాద్, అమరావతి, చెన్నై హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్ రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించిన ఈ కారిడార్‌కు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ ప్రక్రియ వేగవంతమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేసిన సూచనలతో ఈ కారిడార్ అమరావతి ప్రాంతం మీదుగానే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
..
దాదాపు 760 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ హైస్పీడ్ రైలు మార్గం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానించనుంది. తొలుత ఈ కారిడార్‌ను గుంటూరు జిల్లా రావెల సమీపంలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా తీసుకెళ్లాలని కేంద్రం నిర్ణయించింది.

అయితే తాజా సమీక్షల్లో ఈ మార్గం అమరావతి రాజధాని ప్రాంతానికి, విజయవాడ నగరానికి కొంత దూరంగా వెళ్లే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. రాజధాని నగర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కారిడార్‌ను నేరుగా అమరావతి మీదుగానే తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.