కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో సుమారు 50 టన్నుల బంగారు నిల్వలను గుర్తించినట్లు ఏపీ గనులశాఖ..!

దేశంలో బంగారం గనులు అనగానే మనకు మొదట గుర్తొచ్చేది కర్ణాటకలోని కోలార్ లేదా హుట్టి గనులు. కానీ, త్వరలోనే ఆ చరిత్ర మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం AP Govt Says 50 tonn దేశంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా అవతరించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతం.. బంగారం తవ్వకాలకు అడ్డాగా మారబోతోంది..

50 టన్నుల బంగారు నిల్వలు..

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో సుమారు 50 టన్నుల బంగారు నిల్వలను గుర్తించినట్లు ఏపీ గనులశాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. జొన్నగిరితో పాటు రామగిరి, జవ్వకుల, చిగురుకుంట, బిస్నాతం వంటి మరో నాలుగు ప్రాంతాల్లోనూ బంగారు నిక్షేపాలను గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. ‘మా అంచనా ప్రకారం ఒక్క జొన్నగిరిలోనే 50 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. కాబట్టి కొన్నేళ్ల తర్వాత దేశానికే అత్యధిక బంగారం సరఫరా చేసే రాష్ట్రంగా ఏపీ ఎదుగుతుందని గట్టి నమ్మకం ఉంది’ అని ఓ జాతీయ మీడియాతో ముకేశ్ కుమార్ మీనా చెప్పుకొచ్చారు.. .

ఏపీ రాబోయే కొద్ది సంవత్సరాలలో భారత్‌లోనే అత్యంత కీలకమైన , అతిపెద్ద బంగారు సరఫరాదారుగా అవతరించబోతోందని రాష్ట్ర గనుల శాఖ అధికారికంగా వెల్లడించింది. రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో కనుక్కున్న భారీ బంగారు నిల్వలే ఇందుకు ప్రధాన కారణం. గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతిలో నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో ఈ విషయాలను పంచుకున్నారు.

ప్రభుత్వం జరిపిన ప్రాథమిక పరిశోధనల ప్రకారం ఒక్క జొన్నగిరి భూగర్భంలోనే సుమారు 50 టన్నుల వరకు స్వచ్ఛమైన బంగారు నిల్వలు దాగి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేవలం జొన్నగిరి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రామగిరి, జవ్వకుల , చిగురుకుంట, బిస్నాతం వంటి మరో నాలుగు ప్రాంతాలను కూడా బంగారు గనుల తవ్వకానికి అత్యంత అనుకూలమైన ప్రదేశాలుగా రక్షణ శాఖ ఇప్పటికే గుర్తించింది. ప్రస్తుత సమాచారం ప్రకారం జొన్నగిరి పరిధిలో వాణిజ్యపరమైన బంగారు ఉత్పత్తి ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా ప్రారంభమైంది.దాదాపు ఒక దశాబ్దం క్రితమే జొన్నగిరి గ్రామంలో బంగారు తవ్వకాలకు సంబంధించిన పరిశోధనలు , కార్యాచరణల కోసం ప్రభుత్వం సుమారు 1,500 ఎకరాల భూమిని అధికారికంగా కేటాయించింది. అయితే ఇప్పటివరకు కేటాయించిన మొత్తం భూమిలో కేవలం 500 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే మైనింగ్ సంస్థలు పూర్తిస్థాయిలో అన్వేషణ పనులు జరిపాయి.

కేవలం ఈ 500 ఎకరాల పరిధిలోనే దాదాపు 13 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. మిగిలిన 1,000 ఎకరాల విస్తీర్ణంలో అన్వేషణ పనులు రాబోయే రోజుల్లో దశలవారీగా ప్రారంభం కానున్నాయి. ఈ మిగిలిన భూమిలో కూడా సర్వే పూర్తయితే జొన్నగిరి నిల్వలు ఏకంగా 50 టన్నుల మార్కును సులభంగా తాకుతాయని ముఖేష్ కుమార్ మీనా చెబుతున్నారు.

క్లిష్ట ప్రక్రియ…
బంగారు గనుల తవ్వకం భారీ మూలధనం , అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలతో కూడిన క్లిష్టమైన ప్రక్రియ కావడం వల్ల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకమైన టెండర్ విధానం ద్వారా ఈ మైనింగ్ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి అప్పగించింది. ఈ ప్రాజెక్టును జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డెక్కన్ గోల్డ్ మైన్స్ , త్రివేణి ఎర్త్‌మూవర్స్ భాగస్వామ్యంతో సుమారు రూ. 400 కోట్ల భారీ పెట్టుబడితో సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో ఏర్పాటైన మొట్టమొదటి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిస్తే ఏడాదికి సగటున 750 నుండి 1,000 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని అంచనా వేస్తున్నారు.

ఒకప్పుడు వజ్రాలు, బంగారానికి నిలయమై రతనాల సీమగా వెలుగొందిన రాయలసీమ ప్రాంతం, కాలక్రమేణా కరువు ప్రాంతంగా మారిపోయింది. ఇప్పుడు ఈ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ రాకతో ఈ ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవం రాబోతోందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.