ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షలు నమోదయ్యే అవకాశం..!

ఇటీవల వాతావరణం కొత్త వేడిగా ఉన్న రుతుపవనాలు జాడలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్న వేళ ప్రస్తుతం రైతులకి చల్లటి కబురు అందుతుంది..నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ Andhra Pradesh, Telangana state రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ weather శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాల ప్రభావం బలంగా ఉండనుంది. బంగాళాఖాతం నుండి వీస్తున్న తేమ గాలుల కారణంగా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు..