పెదోళ్ళ ఇండ్లలో 200యూనిట్లు, 500 లకే గ్యాస్ ఇస్తున్నాం.. CM రేవంత్ రెడ్డి…..

రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా పలు కీలక ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారుల రూపురేఖలను మార్చే భారీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు, నల్గొండ ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు…పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మొదట కనగల్ మార్కెట్ యార్డ్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రతిష్టాత్మక హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM – HAM) రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి, దానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా సుమారు రూ.13,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 441 రహదారులను గుర్తించి, మొత్తం 6,092 కిలోమీటర్ల మేర అధునాతన రోడ్లను నిర్మించనున్నారు…

CM రేవంత్ రెడ్డి.. మాట్లాడుతూ..

తెలంగాణ సాధనలో.. మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలిన.. కొండ లక్ష్మణ్ బాపూజీ ముందంజలో ఉంటే.. ఆ తర్వాత నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారు..

-ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్.. BRS పార్టీ తీరు.
-కోమటిరెడ్డి త్యాగం ముందు..అగ్గిపెట్టె రావు త్యాగమా..? శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య, యాదయ్య, ఈశాన రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి త్యాగాల ముందు.. నీ త్యాగం ఎంత..?

ఉద్యమం ముసుగులో ఫాం హౌజ్ పాలిటిక్స్.

2014 లో 60 వేల కోట్ల నుంచి 6 లక్షల కోట్లకు అప్పులపాలు చేసింది మీరు కదా..?.

మీ కుటుంబం, మీ దోపిడి, దొంగతనాల్లో బాగాస్తులే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు.

BRS గతం.. మీకు మళ్ళీ పదవులు రావు.BRS నాయకులను ఉప్పు పాతర వేశాం. మళ్ళీ మొలవనియ్యం.సూర్యాపేట లో మూడు అడుగుల నాయకుడిని మళ్ళీ అసెంబ్లీలోకి రానివ్వమని ఆ ప్రాంత యువత అంటున్నారు.

మా మూడేళ్ల పాలన.. 10 ఏళ్ల BRS పాలన, 12 ఏళ్ల BJP పాలన.. మీ మానిఫెస్టో మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు చేద్దాం.. సిద్ధమా..? అని సవాల్..

-ఐదేళ్లు మహిళలకు క్యాబినెట్ లో చోటు ఇవ్వని గత ప్రభుత్వం..

ఆనాడు కొత్త రేషన్ కార్డులు దిక్కులేదు. మేం కొత్త కార్డులు ఇచ్చాం.

దొడ్డు బియ్యం.. బర్లకు పోశారు.

ఏటా 16 వేల కోట్లతో.. 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం.

పేదవారి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే.. మీకు కళ్ళు మండుతున్నాయి. కడుపు మండుతుంది .

మీరేమో వందల ఎకరాల్లో.. వందల కోట్లతో ఫాం హౌజ్ కట్టుకోవచ్చు.

పేదలకు ఇళ్లు ఇస్తే మీకు కడుపు మంట.

మీకు భవంతులు, బంగ్లాలు, ఫాం హౌజ్ లకు పరిమితం.

-పెదోళ్ళ ఇండ్లలో 200యూనిట్లు, 500 లకే గ్యాస్..

రైతు భరోసాతో.. రైతుల కళ్లలో ఆనందం.

దేశంలో అత్యధిక వరి ధాన్యం పండిస్తున్న తెలంగాణ.. రాష్ట్రoల్లో నల్లగొండ ఫస్ట్ ప్లేస్..

80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించాo.

కాళేశ్వరం.. కాళేశ్వరం చేశారు.

-ప్రభుత్వ బడికి, ఆసుపత్రికి పోవాలంటే.. ఒకప్పుడు భయపడేవారు.

మా ప్రభుత్వంలో.. ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రికి పెద్ద ఎత్తున నిధులు..

SC కులాల వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ.

ప్రజా పాలన పోవాలి.. పాపాల భైరవుడి పాలన రావాలట..

SLBC పాపం మీది కదా..?.ఆఖరికి.. మొగుడు, పెళ్ళాం మాటలు విన్నోళ్లను రబ్బర్ చెప్పుతో కొట్టాలి…

బావ, బామ్మర్ధులు.. బిళ్ళ-రంగాలు లెక్క మారారు..

సింగరేణిలో టెండర్ కాలేదు.. అబద్ధాలు ప్రచారం.

గత పదేళ్లలో గత పాలకుల దోపిడీ ప్రజలు మర్చిపోలేదు.

నల్లగొండ ప్రజలకు అండగా ఉంటా..

-వచ్చే ఎన్నికల్లోగా SLBC టన్నెల్, డిండి ప్రాజెక్టును పూర్తి చేస్తా.
నది ప్రక్షాళనచేసి తీరుగా..

మూసి కంపు నుంచి నల్లగొండ బిడ్డలను కాపాడుట.

-ఎవడు అడ్డు వచ్చిన.. మూసిలో తొక్కుతా..

2028 to 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ చేసి తీరుతా..

నల్లగొండ జిల్లా మహిళా సమాఖ్యకు 172 కోట్ల చెక్కుల పంపిణీ.. చేశామని అన్నారు..