ప్రముఖ మేసెంజర్ యాప్ వాట్పాస్ యూజర్‌నేమ్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది… ఫీచర్ భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ముందే.. ఇది ఎంతవరకు సురక్షితం? సైబర్ నేరాలను ఎలా నివారిస్తుంది? అనే అంశాలపై క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాతే దీన్ని ఇండియాలో అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
అసలు ఏమిటీ యూజర్ నేమ్ ఫీచర్?
ఇప్పుడు మనం వాట్సాప్‌లో ఒకరితో చాట్ చేయాలంటే కచ్చితంగా మొబైల్ నెంబర్ అవసరం. కానీ ఇప్పుడు వాట్సాప్ తేబోయే ఈ కొత్త ఫీచర్లో మొబైల్ నంబర్ లేకుండానే కేవలం ఒక యూజర్‌నేమ్ ద్వారా మనం వేరే వ్యక్తును కాంటాక్ట్ అవ్వవచ్చు.. వారితో చాట్ చేయవచ్చు.అయితే ఇది యూజర్స్‌కు మరింత సేఫ్టీని ఇస్తుందని మెటా చెప్తుండగా.. దీన్నిసైబర్నేరగాళ్లు దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. మొబైల్ నెంబర్ ఉంటే నేగరాళ్లను పట్టుకోవడానిక వీలవుతుందని.. కానీ యూజర్ నేమ్ ద్వారా ఫేక్ అకౌంట్స్ పేరిగే ఛాన్స్ ఉందని ప్రభుత్వం అంటోంది.