హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ విడివిడిగా లేఖలు పంపారు.
ఇటీవల 2026 జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను నిర్ధారించడం అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు, ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ (SBI CAPS)ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు…
గత సమావేశాల నిర్ణయాల ప్రకారం.. మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను నిర్ధారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ (Refinancing) బాధ్యతలతో పాటు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ (SBICAPS)ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించారు. అయితే, ఈ విషయంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR)ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరగడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.