ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఛాతి భాగంలో తీవ్ర గాయం…!

మేడ్చల్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. అడుగడుగునా పోలీసులు కేటీఆర్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని brs నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగేరు. ఇదే క్రమంలో ప్రమాదంలో బీఆర్‌ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఛాతి భాగంలో బలమైన గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన తీవ్రమైన నొప్పితో బాధపడటంతో, మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం ఆయన్ను అత్యవసరంగా కొంపల్లిలోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన సమయం నుండి ఆసుపత్రికి తరలించే వరకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వెంటే ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల మహదేవ్‌పూర్ మండలం కన్నెపల్లి వద్ద ఉన్న లక్ష్మి పంప్‌హౌస్ పరిశీలనకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు ఆదివారం ఉదయం బయలుదేరారు. అయితే పోలీసులు జనగాం వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది..