హమారా గాడీ, హమారా అధికార్.. అనే ట్యాగ్ లైన్ తో ప్రముఖ ఆంత్రాప్రెన్యూవర్, టీవీ నటుడు తెహసీన్ పూనావాలా ఆధ్యర్యంలో జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం బలవంతంగా ఈ20 పెట్రోల్ పేరున 20 శాతం ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.
అంతకు ముందు.. ఇటీవలే.. E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందని, వాహనాలు అరిగిపోతాయని వస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఆటోమొబైల్, ఆయిల్ కంపెనీలకు చెందిన నిపుణులతో కూడిన బృందం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని సమర్థించింది. E20 వల్ల వాహనాలకు హాని కలుగుతుందనడానికి చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదని పరీక్షల్లో తేలినట్లు చెప్పారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 పెట్రోల్ వల్ల ఎలాంటి డ్యామేజ్ జరగదని చెబుతున్నారని.. అందులో నిజం లేదని నిరసనకారులు అన్నారు.. ఇది కేంద్ర ప్రభుత్వాన్నో, బీజేపీ నో టార్గెట్ చేస్తున్న నిరసన కాదని.. నిరసనకారులలో చాలామంది బీజేపీ మద్దతుదారులమని చెప్పారు. ఇథనాల్-బ్లెండింగ్ విధానాన్ని అమలు చేస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు…గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఈ20 పై ఫిర్యాదుల వెల్లువ వెల్లువెత్తింది — కార్లు ఆగిపోవడం, మైలేజీ సడెన్ గా పడిపోవడం, ఫ్యూయల్ ఫిల్టర్లు మూసుకుపోవడం, రిపేర్ లకు ఖర్చు ఎక్కువ కావడం వంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (EBP) కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వేగంగా ప్రారంభించి, గడువు కంటే ఐదేళ్ల ముందే లక్ష్యాన్ని సాధించింది ప్రభుత్వం. అయితే వెహికిల్ ఓనర్లపై భారీప్రయోగమని విమర్శకులు వాదిస్తున్నారు . గత 15 ఏళ్లలో ఇండియాలో అమ్ముడైన కార్లలో సుమారు 80% E20కి పూర్తిగా అనుకూలంగా లేనివే ఉన్నాయి. ఎందుకంటే వాటిలో చాలా వరకు E10 లేదా అంతకంటే బ్లెండింగ్ ఇంధనాల కోసం తయారు చేసినవే. ..