అర్ధరాత్రి నీళ్ల కోసం విద్యార్థినుల అవస్థలు…వీసీ ఇంటి ఎదుట ఆందోళన..
_*• నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయలోని బాలికల హాస్టల్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థినులు అర్ధరాత్రి వీసీ నివాసం ఎదుట నిరసనకు దిగారు.* హాస్టల్లో తాగునీరు, నిత్యావసరాలకు అవసరమైన నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు._
నీటి సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం లభించలేదని వారు ఆరోపించారు. దీంతో అర్ధరాత్రి వీసీ నివాసం వద్దకు చేరుకుని తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
_• బాలికల హాస్టల్లో మౌలిక వసతులు కల్పించి, నిరంతర నీటి సరఫరా అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు విశ్వవిద్యాలయ వీసీనీ కోరారు.