పోలీసుల అదుపులో షాబాద్ పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్..
తిమ్మాపూర్ సమీపంలో ఓ కానిస్టేబుల్ వెంబడించి పట్టుకున్నాడని చెప్తున్న ప్రత్యక్ష సాక్షి..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురిని హత్యచేసి పరారైన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆరుగురిని హత్య చేసిన అనంతరం కారులో బాల్నగర్ వైపు వెళ్లినట్లు సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అతను ఉపయోగించిన రెడ్ కలర్ షిఫ్ట్ కారును కొత్తూరు ప్రాంతంలోని నందిగామ ఆర్యుబి సమీపంలో పోలీసులు గుర్తించారు. అయితే, రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది..పోక్సో కేసులో బెయిల్ పై బయటికొచ్చి ఆరు హత్యలు చేసిన షాబాద్ సైకో రాజ్ కుమార్ కొత్తూరు మండలం కుమ్మరిగూడెం గ్రామంలో కనిపించినట్లు.. అతన్ని ఓ పోలీస్ కానిస్టేబుల్ తీసుకెళ్లారని స్థానికుడు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో షాబాద్ మర్డర్స్ సైకో కిల్లర్ పోలీసులు అదుపులో ఉన్నాడా? పోలీసులు అతన్ని రహస్యంగా విచారణ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పోలీసులు మాత్రం ప్రత్యేక బృందాలతో నిందితుడికోసం గాలింపు జరుగుతుందని పేర్కొంటున్నారు. రాజ్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు నిందితుడిని పట్టించిన వారికి రూ.2లక్షల బహుమతిని కూడా ప్రకటించారు. నిందితుడు రాజ్ కుమార్ కారును వదిలి రైలులో ప్రయాణించాడనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
గంట వ్యవధిలోనే ఆరు హత్యలు..
శుక్రవారం రాత్రి నిందితుడు రాజ్ కుమార్ సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకొని.. రాత్రి 11గంటల ప్రాంతంలో బాలిక ఇంటికి వెళ్లాడు. బాలికను తనతో లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో అడ్డొచ్చిన బాలిక తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు. నిద్రిస్తున్న బాలిక నాయనమ్మ రుక్కమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అరిస్తే చంపేస్తానంటూ బాలికను అక్కడి నుంచి సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలిక గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం దైవాలగూడలోని తన ఇంటికి వెళ్లి.. భార్యపై దాడి చేసి కడుపులో బలంగా మూడు పోట్లు పొడిచాడు. అరవకుండా గొంతు కోశాడు. పక్కనే బెడ్ పై నిద్రిస్తున్న పరీక్షిత్, దైవీక్షిత్ గొంతులు కోశాడు. అక్కడి నుంచి కారులో పరారయ్యాడు..
పోలీసుల అదుపులో షాబాద్ పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్..
తిమ్మాపూర్ సమీపంలో ఓ కానిస్టేబుల్ వెంబడించి పట్టుకున్నాడని చెప్తున్న ప్రత్యక్ష సాక్షి..
టిఫిన్ సెంటర్ ఎక్కడ అని అడుగుతున్న సమయంలోనే కానిస్టేబుల్ వచ్చి నిందితున్ని పట్టుకుపోయినట్లుగా తెలిపిన ప్రత్యక్ష సాక్షి..
https://youtu.be/hirZrtoZk8o