చిన్నారులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ.
– ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
– తీదేడు గ్రామ సర్పంచ్
చింతపల్లి………
చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో నులి పురుగుల నివారణ మాత్రలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె అన్నారు.ప్రతి చిన్నారికి తప్పనిసరిగా ఈ మాత్రలు వేయించడం ద్వారా శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు లోను కాకుండా ప్రభుత్వ సూచనల మేరకు పిల్లలకు మాత్రలు వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు మాదగోని కృష్ణ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు సిమర్ల శ్రీను యాదవ్,మెరిక శంకరయ్య,వైద్య ఆరోగ్య శాఖ ANM లు లలిత,రామలక్ష్మి,ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ టీచర్లు,పాఠశాల ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.