విద్యార్థుల ఐక్య పోరాటానికి విజయం – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
విద్యార్థుల ఐక్య పోరాటానికి విజయం –
దేవరకొండ…………
కేంద్ర విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా స్వాగతించదగ్గ పరిణామం…
BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు వేములరాజు…
విద్యార్థుల న్యాయమైన హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా సాగిన ఐక్య ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ముఖ్యమైన విజయంగా నిలిచిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు పేర్కొన్నారు..
విద్యార్థుల నిరంతర పోరాటం, ఐక్యత, ప్రజాస్వామ్య పద్ధతిలో సాగిన ఉద్యమం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
విద్యార్థుల స్వరం ఎంత శక్తివంతమైనదో ఈ పరిణామం మరోసారి దేశానికి చాటిచెప్పిందన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి విద్యార్థికి ఆయన అభినందనలు తెలిపారు.
భవిష్యత్తులో కూడా విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడే విధానాలను పూర్తిగా విరమించుకోవాలని వేముల రాజు డిమాండ్ చేశారు.